కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్న ప్రచారంపై సోయం బాపూరావు స్పందన
- కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎంపీ ఆవేదన
- తన కొడుకు పెళ్లికి పార్టీలకతీతంగా అందర్నీ ఆహ్వానిస్తానని వెల్లడి
- కర్ణాటకలో గెలిచినంత మాత్రాన దేశమంతా గెలిచినట్లు కాదన్న సోయం
తన తనయుడి పెళ్లికి ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల వద్దకు కూడా వెళ్తానని చెప్పారు. ఇటీవలి వరకు కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డిని తానే బీజేపీలోకి ఆహ్వానించానని, ఆయనతో తనకు ఎలాంటి విభేదాల్లేవన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాననే ప్రచారం వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం ఉందని మండిపడ్డారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన దేశమంతా గెలిచినట్లు కాదని, అక్కడ బీజేపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని గుర్తు చేశారు.