Jogi Ramesh: ‘నీరా కేఫ్’లో నీరాను రుచి చూసిన ఏపీ, తెలంగాణ మంత్రులు.. ఇదిగో వీడియో!

ap minister jogi ramesh visits neera cafe at necklace road in hyderabad
  • హైదరాబాద్ లో నీరా కేఫ్ ను సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేశ్
  • అక్కడ దొరికే ఉత్పత్తుల గురించి వివరించిన శ్రీనివాస్ గౌడ్
  • వీరితోపాటు పాల్గొన్న సినీ నటుడు సుమన్
హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్డులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘నీరా కేఫ్‌’ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి జోగి రమేశ్ మంగళవారం సందర్శించారు. నీరా కేఫ్‌ కు వ‌చ్చిన‌ జోగి రమేశ్ కు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు. తర్వాత జోగి రమేశ్ ను శాలువాతో స‌త్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా నీరా కేఫ్‌లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు సుమన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా నీరాను రుచి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీనివాస్ గౌడ్ ట్వీట్ చేశారు.
Jogi Ramesh
neera cafe
V Srinivas Goud
necklace road
Hyderabad

More Telugu News