ఇండియన్ ఫుడ్ పై మనసు పారేసుకున్న ఎలాన్ మస్క్

Elon Musk shows his interest on Indian food
  • విదేశీయులను విపరీతంగా ఆకట్టుకుంటున్న భారతీయ వంటకాలు
  • ప్రపంచ ప్రముఖులు సైతం మన తిండికి ఫిదా
  • ఆ జాబితాలో మస్క్ కూడా చేరిన వైనం
  • భారతీయ వంటకాలతో ఓ వ్యక్తి చేసిన ట్వీట్ కు స్పందించిన మస్క్
భారత సంస్కృతి, భారతీయులు మేధాశక్తి మాత్రమే కాదు... భారతీయ వంటకాలు సైతం విదేశీయులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. ప్రపంచ ప్రముఖులు సైతం భారతీయ రుచులకు ఫిదా అవుతుంటారు. తాజాగా ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఇండియన్ ఫుడ్ పై తన మక్కువను చాటుకున్నారు. 

ట్విట్టర్ లో ఓ యూజర్ భారతీయ వంటకాల గురించి ఓ పోస్టు పెట్టాడు. అన్నం, బటర్ చికెన్, నాన్ రోటీ ఫొటోను పంచుకుంటూ భారతీయ వంటకాలను తానెంతగానో ఇష్టపడతానని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఈ ట్వీట్ ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించింది. మీరు చెప్పేది నిజమే అంటూ ఆ వ్యక్తి ట్వీట్ కు మస్క్ స్పందించారు. 

కొద్ది సమయంలో ఈ ట్వీట్ వైరల్ అయింది. ఈ ట్వీట్ పట్ల భారతీయులు స్పందిస్తూ... మస్క్ భారత్ వచ్చి ఇక్కడి వంటకాలను రుచి చూడాలంటూ కోరారు. త్వరలోనే భారత పర్యటన ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Go Back to Shorts
Elon Musk
Indian Food
India
Twitter

More Telugu News