mouth Tastes: నోటి రుచులు.. వాటి వెనుక ఆరోగ్య సమస్యలు

  • చేదు, తీపి, పులుపు, ఉప్పటి రుచుల వెనుక ఎన్నో కారణాలు
  • తగినంత నీరు తాగకపోయినా సమస్యే
  • బ్రష్ చేసినా పోకపోతే వైద్యులను సంప్రదించాలి
Tastes In Your Mouth That Are A Sign Of Dangerous Health Problems

ప్రతి పదార్థానికి ఒక రుచి ఉంటుంది. కొన్ని పదార్థాలు తిన్న తర్వాత వాటి తాలూకూ రుచులు కొంత సమయం పాటు తెలుస్తుంటాయి. వెల్లుల్లి, ఉల్లి ఇలాంటి పదార్థాలే. నోటి నుంచి వచ్చే వాసన గిట్టని వారు మౌత్ ఫ్రెష్ నర్లను ఉపయోగిస్తుంటారు. నోటి నుంచి దుర్వాసన, చెడు రుచి అనిపిస్తుంటే దాని వెనుక ఆరోగ్య సమస్యలు ఉండొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వీటికి చికిత్స అవసరం పడొచ్చు. కొన్ని రకాల వ్యాధులు కొన్ని రకాల రుచులకు కారణం కావచ్చు. కనుక అలాంటి పరిస్థితి ఎదురైతే వైద్యులకు చూపించుకోవాలి.

చేదు
హార్మోన్లలో మార్పులు, నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఒత్తిడి, మెనోపాజ్, యాసిడ్ రిఫ్లక్స్, నరాలు దెబ్బతినడం నోటిలో చేదు రుచికి కారణాలు కావచ్చు. డిస్ జూసియా కండిషన్ కూడా కారణం కావచ్చు. అంటే కొన్ని రకాల చికిత్సలు, ఔషధాల వినియోగం వల్ల కూడా ఇలా ఉంటుంది. లేదంటే విటమిన్లు, మినరల్స్ లోపం వల్ల కూడా కావచ్చు. నోటిని బ్రష్ చేసిన తర్వాత కూడా ఈ విధమైన చేదు రుచి ఉందంటే అప్పుడు తప్పకుండా వైద్యులను ఒక్కసారి సంప్రదించాలి. 

తీపి
మధుమేహం సమస్య బారిన పడిన వారిలో నోటిలో తీపి రుచి ఉంటుంది. ఇలా అనిపించినప్పుడు ఒక్కసారి బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోవాలి. పరిమితి మించి ఉంటే చికిత్స తీసుకోవాలి. దీన్ని డయాబెటిస్ కెటోసిడోసిస్ అని అంటారు. మన శరీరం గ్లూకోజ్ ను శక్తిగా ఉపయోగించుకోకుండా, నిల్వ ఉన్న కొవ్వును వాడుకుంటుంటే.. శరీరంలో కీటోన్లు పేరుకుపోయి నోటిలో తియ్యటి రుచి అనిపిస్తుంటుంది. ఇలా అనిపించినప్పుడు తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటే, దాహం వేస్తుంటే అది మధుమేహంగానే అనుమానించాలి. ఇన్ఫెక్షన్లు, న్యూరలాజికల్ పరిస్థితులు, యాసిడ్ రిఫ్లక్స్, గర్భధారణ, లంగ్ కేన్సర్ లోనూ నోటిలో తీపి అనిపించొచ్చు.

పులుపు
నోరు ఎండిపోవడం, పోషకాల లోపం, గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ వ్యాధి (జెర్డ్), నరాల సమస్యలు, ఆందోళనలో ఈ రుచి అనిపించొచ్చు. కొన్ని రకాల ఆహార అలవాట్లు కూడా దీనికి కారణం అవుతుంటాయి. నీరు తగినంత తాగనప్పునడు నోరు ఎండిపోతుంది. అప్పుడు కూడా ఈ రుచి అనిపిస్తుంది. 

ఉప్పు
నోటిలో ఉప్పగా అనిపిస్తే శరీరంలో నీటి పరిమాణం తగ్గిపోయిందనడానికి (డీహైడ్రేషన్) సంకేతం. దీంతో వెంటనే నీరు తాగాలి. విరేచనాలు, వాంతులతోనూ డీహైడ్రేషన్ రావచ్చు. డీహైడ్రేషన్ ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ సమస్యలు వస్తాయి.

More Telugu News