Congress: కర్ణాటకలో కాంగ్రెస్ ఉచిత హామీల ఖరీదు రూ.62,000 కోట్లు!

  • మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు ఉచిత హామీలు ప్రకటించిన కాంగ్రెస్
  • ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • మహిళలకు నెలకు రూ.2 వేలు, బీపీఎల్ కుటుంబానికి ఉచితంగా పది కిలోల బియ్యం
  • నిరుద్యోగులకు రూ.3 వేల భృతి, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం
  • మత్స్యకారులకు 500 లీటర్ల డీజిల్ ప్రకటన
Congress victory might Rs 62000 crore cost Karnataka this much every year

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించింది. అయితే ఈ విజయానికి ముఖ్య కారణం పెద్ద ఎత్తున ఉచిత హామీలు ఇవ్వడం. మేనిఫెస్టోలో ప్రధానంగా ఐదు ఉచిత పథకాలు ప్రకటించింది హస్తం పార్టీ. ఈ ఐదు ఉచిత హామీలు అమలు చేయడానికి ఏడాదికి రూ.62,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర బడ్జెట్ లో ఇది 20 శాతం.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల విషయానికి వస్తే ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు నెలకు రూ.2 వేలు, బీపీఎల్ కుటుంబానికి ఉచితంగా పది కిలోల బియ్యం, నిరుద్యోగులకు రూ.3వేల భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తదితర హామీలు ఉన్నాయి. అలాగే మత్స్యకారులకు 500 లీటర్ల డీజిల్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. మెరైన్ ఫిషర్ మెన్లందరికీ ఏడాదికి రూ.6000 ఇస్తామని చెప్పింది. కౌ డంగ్ ను కిలో రూ.3కు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. వీటన్నింటికి రూ.62 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు.

More Telugu News