Hyderabad: ఉగ్రవాద లింక్స్‌ కేసులో హైదరాబాద్‌లో మరో ఇద్దరి అరెస్ట్

  • ఇటీవలే హైదరాబాద్ లో ఆరుగురు, భోపాల్ లో 11 మంది అరెస్ట్
  • నేటి అరెస్టుతో 19కి చేరుకున్న సంఖ్య
  • ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తహరీర్ తో సంబంధాల ఆరోపణలు
Two terror suspects arrested in Hyderabad

ఉగ్రవాద లింక్ కేసులో కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాదులో సోమవారం మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. చాంద్రాయణగుట్టలోని బాబా నగర్ నుండి ఏటీఎస్ - కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఇటీవలే ఆరుగురిని అరెస్ట్ చేయగా, భోపాల్‌లో 11 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా నేడు మరో ఇద్దరి అరెస్ట్‌తో ఈ సంఖ్య 19కి చేరుకుంది. ఉగ్రవాద సంస్థ హిజ్బ్ ఉత్ తహరీర్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచి భోపాల్ కు తరలించారు.

More Telugu News