Karnataka: కర్ణాటక ఫలితాలపై భారత్ జోడో యాత్ర ప్రభావం ఎంత?... జైరాం రమేశ్ విశ్లేషణ ఇదే!

Jai ram ramesh analysis on impact of bharat jodo yatra in karnataka elections
  •  పాద యాత్ర జరిగిన ప్రాంతాల్లో కాంగ్రెస్ పుంజుకుందన్న జైరాం
  • గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ, జేడీఎస్ బలహీన పడిందని కామెంట్
  • పాదయాత్రతో కర్ణాటకలో కాంగ్రెస్ శ్రేణులు ఏకమయ్యాయని వెల్లడి
  • ప్రజలతో రాహుల్ గాంధీ చర్చల సమాహారమే కాంగ్రెస్ మ్యానిఫెస్టో అని కామెంట్ 
కర్ణాటక ఎన్నికలపై భారత్ జోడో యాత్ర ప్రభావమెంతో వివరిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఓ విశ్లేషణను విడుదల చేశారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో ప్రస్తుత విజయాన్ని పోలుస్తు ఓ రిపోర్డును పంచుకున్నారు. కర్ణాటకలోని మొత్తం 20 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ భారత్ జోడో పేరిట పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. 

జైరాం రమేశ్ పేర్కొన్న వివరాల ప్రకారం.. 2018 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ 20 సీట్లల్లో ఐదింటిని గెలుచుకుంది. అయితే.. ఇప్పుడు 15 సీట్లల్లో ఆధిక్యం సాధించింది. ఇక గత ఎన్నికల్లో 9 సీట్లు గెలుచుకున్న బీజేపీ మాత్రం కేవలం 2 సీట్లలోనే ఆధిక్యంలో నిలిచింది. మునుపటి ఎన్నికల్లో 20లో ఆరు సీట్లు గెలుచుకున్న జేడీఎస్ కేవలం మూడు సీట్లలోనే ఆధిక్యంలో ఉన్నట్టు కౌంటింగ్‌లో ( సాయంత్రం 4 గంటల సమయంలో) తేలింది. 

‘‘ఇది భారత్ జోడో యాత్ర చూపించిన ప్రత్యక్ష ప్రభావం. అయితే, కర్ణాటకలో మన కంటికి కనిపించని ప్రభావం మరెంతో ఉంది. జోడో యాత్ర సందర్భంగా పార్టీ శ్రేణులు ఏకతాటిపైకి వచ్చాయి. కేడర్ పునరుత్తేజితమైంది. ఎన్నికల్లో ఎజెండా ఖరారైంది. యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ అనేక వర్గాలతో చర్చలు జరిపారు. ఆ చర్చల ద్వారానే మ్యానిఫెస్టోలోని కీలక హామీలు రూపుదిద్దుకున్నాయి’’ అని జైరాం రమేశ్ పేర్కొన్నారు.   


Karnataka
Rahul Gandhi

More Telugu News