JioCinema: జియో సినిమా యూజర్లకు సబ్ స్క్రిప్షన్ ప్లాన్

JioCinema Premium subscription plan launched in India
  • ప్రీమియం చందా ప్లాన్ రూ.999 విడుదల
  • దీని ద్వారా మరింత కంటెంట్ చూసుకునే అవకాశం
  • ఏక కాలంలో నలుగురితో షేర్ చేసుకోవచ్చు
ఓటీటీ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ అయిన జియో సినిమా.. ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ప్రకటించింది. మరింత కంటెంట్ ను, పూర్తి స్థాయిలో చూసుకునేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది. ఇది అచ్చంగా మొబైల్ ఫోన్ మార్కెట్లో జియో అనుసరించిన వ్యూహం మాదిరే ఉంది. ఐపీఎల్ మ్యాచులను జియో సినిమాలో ఉచితంగా వీక్షించే అవకాశాన్ని జియో కల్పించింది. దీంతో లక్షలాది సంఖ్యలో యూజర్లు జియో సినిమా యాప్ ను వీక్షిస్తున్నారు. ఇలా వచ్చిన వారి నుంచి ఆదాయం రాబట్టుకునే వ్యూహంలో భాగంగా కసరత్తు చేస్తోంది.

ఏడాదికి రూ.999 ప్లాన్ లో భాగంగా ఏ డివైజ్ నుంచి అయినా జియో సినిమాను చూసుకోవచ్చు. అధిక వీడియో నాణ్యతతో వీక్షించొచ్చని సంస్థ తెలిపింది. ఏక కాలంలో నాలుగు డివైజ్ లపై ఒకే లాగిన్ తో ఇది పనిచేస్తుంది. రూ.999 ప్లాన్ ను ఒకరు తీసుకుని, దాన్ని మరో ముగ్గురికి షేర్ చేసుకోవడం ద్వారా ఒకేసారి నలుగురు వాడుకోవచ్చు. దీనివల్ల కొంత ఆదా అవుతుంది. జియో ప్రీమియం సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లో హెచ్ బీవో వీడియోస్ ను కూడా చూసుకోవచ్చు.
JioCinema
Premium subscription
plan
Rs 999

More Telugu News