Private Hostel: వంట పాత్రలో మూత్రవిసర్జన చేసిన హాస్టల్ ఓనర్

కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. హాస్టల్ ఓనర్ కిచెన్ లో ఓ వంటపాత్రలో మూత్రవిసర్జన చేసింది. ఆపై దానిని సింక్ లో పడేసింది. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో హాస్టల్ ఫుడ్ తినడం మానేసిన విద్యార్థులు.. ఓనర్ పై చర్యలు తీసుకోవాలంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే హాస్టల్ ను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

నగరంలోని మంకమ్మతోటలో ఉన్న వివేక్ బాయ్స్ హాస్టల్ మహిళా ఓనర్ ఈ నీచానికి పాల్పడింది. కిచెన్ లో వంటగదిని అపరిశుభ్రంగా వదిలేయడంతో పాటు విద్యార్థులకు వండిపెట్టే పాత్రలో మూత్రవిసర్జన చేసింది. కిచెన్ లోని సీసీటీవీ కెమెరా ఫుటేజీ బయటపడడంతో సదరు ఓనర్ పై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. హాస్టల్ లో భోజనం తినడం మానేసి ఆందోళనకు దిగారు. హాస్టల్ కు నిర్వహణ అనుమతులను రద్దు చేసి, హాస్టల్ ను సీజ్ చేయాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, రోజులు గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థులు మీడియాను ఆశ్రయించారు.
Private Hostel
Karimnagar District
mankammathota
vivek boys hostel

More Telugu News