‘రంగబలి’గా వస్తున్న నాగశౌర్య
- జులై 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటన
- సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో కొత్త సినిమా
- దర్శకుడిగా పరిచయం కాబోతున్న పవన్ బాసింశెట్టి
ఈ సందర్భంగా నాగశౌర్య ఫొటోతో కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఈ సినిమాకు ప్రత్యేకంగా మేకోవర్ అయిన శౌర్య సరికొత్తగా కనిపించనున్నారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ సి.హెచ్.పవన్ సంగీతం అందిస్తుండగా, దివాకర్ మణి డీవోపీగా పని చేస్తున్నారు. కాగా, ఇటీవలే శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి‘ సినిమాతో నాగశౌర్య ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.