అంతర్జాతీయ నెంబర్ల నుంచి వాట్సప్ స్పామ్ కాల్స్ పై రంగంలోకి కేంద్రం
- ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, కెన్యా దేశాల కోడ్లతో ఫోన్లు
- ఈ విషయంపై వాట్సప్ కు నోటీసులు జారీచేస్తామన్న కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ
- వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు డిజిటల్ వేదికలే బాధ్యత వహించాలని స్పష్టీకరణ
అంతర్జాతీయ స్పామ్ కాల్స్ వస్తున్న వాట్సప్ నంబర్లను మొదట ఎలా గుర్తించి యాక్సెస్ చేస్తున్నారు? దీని కోసం డేటాబేస్లు ఉపయోగిస్తున్నారా? అనే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. భారత్ లోని వాట్సప్ వినియోగదారులకు గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ స్పామ్ కాల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ స్పామ్ కాల్స్ ప్రధానంగా ఇండోనేషియా (62), వియత్నాం (84), మలేషియా (60), కెన్యా (254), ఇథియోపియా (251) దేశ కోడ్లతో వస్తున్నాయని వినియోగదారులు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు.