మొన్న నిఖత్.. నేడు హుసామ్.. ప్రపంచ బాక్సింగ్‌లో తెలంగాణ ’పంచ్’ అదుర్స్
- పురుషుల బాక్సింగ్ చాంపియన్ షిప్ లో సెమీస్ చేరిన హుసామ్
- కాంస్య పతకం ఖాయం చేసుకున్న నిజామాబాద్ ఆటగాడు
- మరో ఇద్దరు భారత బాక్సర్లకు కాంస్యాలు ఖాయం
ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఎడిషన్ లో అత్యధికంగా మూడు పతకాలు రానుండటం భారత్ కు ఇదే తొలిసారి. 57 కిలోల కేటగిరీ క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 4–3తో ఐదో సీడ్ దియాజ్ ఇబనేజ్ (బల్గేరియా)పై ఉత్కంఠ విజయం సాదించాడు. హోరాహోరీగా సాగిన పోరులో ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపెట్టాడు. ఇబనేజ్‌పై బలమైన పంచ్‌లు విసిరాడు. ఇక సెమీస్‌లో అతను క్యూబాకు చెందిన సైడెల్ హొర్టాతో పోటీ పడతాడు. 51 కిలోల క్వార్టర్ ఫైనల్లో దీపక్5–0తో నుర్జిట్ (కిర్గిస్తాన్)ను చిత్తు చేశాడు. 71 కిలోల క్వార్టర్ ఫైనల్లో నిశాంత్ సైతం 5–0తో క్యూబాకు చెందిన జార్జ్ క్యుయెలర్‌ను నాకౌట్ చేశాడు.