తెలంగాణలో నేటి నుంచి అసలైన వేసవి.. జాగ్రత్తగా ఉండాల్సిందే
- ఉష్ణోగ్రతలు పెరుగుతాయన్న వాతావరణ కేంద్రం
- 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని వెల్లడి
- పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరిక
ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో మంగళవారం 40 డిగ్రీలకు అటు ఇటుగా ఎండ ఉంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు పెరగనున్నాయి. దీనికి తోడు విపరీతమైన ఉక్కపోత తోడవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరికానున్నారు. అలాగే, ఈ రోజు నుంచి 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.