Balagam: బలగం సినిమాకు మరో రెండు అవార్డులు

  • స్వీడిష్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడు అవార్డు
  • ఉత్తమ సహాయనటుడు అవార్డునూ దక్కించుకున్న బలగం
  • అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న తెలుగు సినిమా
Balagam movie got another two awards in Swedish international film festival 2023

ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన బలగం సినిమాకు అవార్డుల పంట పండుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టిన ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతోంది. బెస్ట్ ఫిల్మ్‌, బెస్ట్ డైరెక్టర్‌, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌, బెస్ట్ సినిమాటోగ్రాఫ‌ర్.. ఇలా అనేక అవార్డుల‌ను దక్కించుకుంది. తాజాగా స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బలగం సినిమా మరో రెండు అవార్డులను గెల్చుకుంది.

హీరో ప్రియదర్శి ఉత్తమ న‌టుడు అవార్డును, కేతిరి సుధాక‌ర్ రెడ్డి (కొమురయ్య) ఉత్తమ సహాయ న‌టుడు అవార్డును దక్కించుకున్నారు. 2021లో ఫ‌హాద్ ఫాజిల్ జోజికు, 2022లో మలయాళ చిత్రం నాయట్టు సినిమాకు స్వీడిష్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు వచ్చాయి. ఓ కుటుంబ పెద్ద చ‌నిపోతే కుటుంబ సభ్యుల భావోద్వేగాలు, బంధాలు, అనుబంధాల నేపథ్యంలో డైరెక్టర్ వేణు ఈ సినిమాను తెరకెక్కించారు.

గతంలో జబర్దస్త్ కామెడీ షోలో నటించిన వేణు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ప్రియ‌ద‌ర్శి పులికొండ‌, కావ్యా క‌ళ్యాణ్ రామ్‌, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప ల‌క్ష్మి, సుధాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్రల్లో న‌టించారు.

More Telugu News