కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి తెర.. మూగబోయిన మైకులు
- ఎల్లుండే కన్నడనాట ఓటింగ్
- బరిలో 2,613 మంది అభ్యర్థులు
- మే 13వ తేదీన తేలనున్న పార్టీల భవితవ్యం!
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. 13వ తారీఖున ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో 918 మంది స్వతంత్రులతో కలిపి 2,613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రతిసారి రెండో పార్టీకి పట్టం గట్టే కన్నడ ప్రజలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే ఆసక్తి అందరిలోను నెలకొంది.