Buragadda Vedavyas: పెడన టీడీపీ టికెట్ నాదే: బూరగడ్డ వేదవ్యాస్

Pedan TDP ticket is mine says Buragadda Vedavyas
  • తాను పెడన నుంచి పోటీ చేయాలనుకుంటున్నానన్న వేదవ్యాస్
  • తన కోరికను చంద్రబాబు కాదనరని ధీమా
  • 2016లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వేదవ్యాస్
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ తనదేనని మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ప్రకటించుకున్నారు. పెడన టికెట్ ఎవరికిస్తున్నారనే విషయాన్ని తమ అధినేత చంద్రబాబు ఇంకా ప్రకటించలేదని... అయితే, తాను మాత్రం ఇక్కడి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నానని చెప్పారు. తన కోరికను చంద్రబాబు కాదనరనే నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే చంద్రబాబును కలుస్తానని... నియోజకవర్గంలోని పరిస్థితులను వివరిస్తానని చెప్పారు. 

మరోవైపు బూరగడ్డ వేదవ్యాస్ ఇప్పటికి రెండు సార్లు కాంగ్రెస్ తరపున మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2014లో వైసీపీలో చేరి పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2016లో టీడీపీలో చేరారు. టీడీపీ హయాంలో మచిలీపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ గా పని చేశారు. 
Buragadda Vedavyas
Telugudesam
Pedana
Chandrababu

More Telugu News