మొయిదీన్ భాయ్‌గా రజనీకాంత్.. లాల్ సలామ్ లో లుక్ అదుర్స్
- కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో ‘లాల్ సలామ్’ సినిమాలో రజనీ అతిథి పాత్ర
- ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేసిన చిత్ర బృందం
- నెల్సన్ దర్శకత్వం ‘జైలర్’ సినిమా చేస్తున్న సూపర్ స్టార్
ఫస్ట్ లుక్ పోస్టర్ లో రజనీ.. కళ్లజోడుపెట్టుకొని, కుర్తా ధరించి స్టయిలిష్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రంలో రజనీ చిన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుంది. ఏ.ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా, రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది.