Adipurush: ట్రైలర్​తోనే చరిత్ర సృష్టించనున్న ఆదిపురుష్

Adipurush trailer to premiere across 70 countries
  • ఈ నెల 9న ప్రభాస్ సినిమా ట్రైలర్ విడుదల
  • భారత్ తోపాటు 70 దేశాల్లో ఒకేసారి ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్
  • జూన్ 16న విడుదల కానున్న చిత్రం
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహించిన చిత్రం 'ఆదిపురుష్'. ఈ సంక్రాంతికే రావాల్సిన చిత్రం వాయిదా పడుతూ జూన్ 16న విడుదల కానుంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటించింది. హీరో సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషించిన ఈ చిత్రం త్రీడీలో వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రభాస్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం వరుసగా పోస్టర్లు వదులుతోంది. 

ప్రభాస్, కృతి లుక్స్‌, జై శ్రీరాం పాట సినిమాపై అంచనాలు పెంచింది. ఈ సినిమా ట్రైలర్ ఈ నెల 9న విడుదల కానుంది. ట్రైలర్ లాంచ్‌తోనే చిత్ర బృందం చరిత్ర సృష్టించనుంది. ఆదిపురుష్ ట్రైలర్ ను భారత్ లో వందకుపైగా థియేటర్లతోపాటు అమెరికా, కెనడా, సింగపూర్, ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మయన్మార్, శ్రీలంక, జపాన్‌,, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా, యూకే, రష్యా లలో ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ జరగబోతోందని చిత్ర బృందం తెలిపింది. మొత్తంగా 70  దేశాల్లో నేరుగా ట్రైలర్ లాంచ్ అవ్వనున్న భారత తొలి సినిమా ఇదే కానుంది. యూవీ క్రియేషన్స్‌, టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి.
Adipurush
Prabhas
Bollywood
trailer
70 countries
record

More Telugu News