Suryapet District: ఇంటి నిర్మాణాన్ని అడ్డుకున్నాడని గొడ్డలితో దాడి చేసిన యజమాని

House owner attack with axe on muncipal employee
  • సూర్యాపేట ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 3లో ఘటన
  • అక్రమ నిర్మాణం అంటూ అడ్డుకున్న మున్సిపల్ సిబ్బంది
  • ఆగ్రహంతో యజమాని దాడి, తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలింపు
సూర్యాపేటలో ఓ ఇంటి యజమాని గొడ్డలితో మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడి ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 3లో అక్రమంగా ఇంటిని నిర్మించారని చెబుతూ, సదరు నిర్మాణాన్ని మున్సిపల్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన యజమాని బిక్షం నాయక్ అనే మున్సిపల్ ఉద్యోగిపై గొడ్డలితో దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.
Suryapet District
Crime News

More Telugu News