Manipur: మణిపూర్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం విమానం పంపిస్తున్న తెలంగాణ ప్రభుత్వం

Telangana govt decide to send plane to Manipur for Telugu people
  • మణిపూర్ లో తీవ్ర ఉద్రిక్తతలు
  • ఎస్టీ హోదా అంశంపై గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణలు
  • ఇంఫాల్ ఎన్ఐటీలో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు
  • 24×7 హెల్ప్ లైన్ ప్రకటించిన తెలంగాణ పోలీసులు
గిరిజన, గిరిజనేతరుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో తెలుగువారు చిక్కుకుపోవడం తెలిసిందే. 150 మందికి పైగా తెలుగు విద్యార్థులు ఇంఫాల్ లోని ఎన్ఐటీలో దయనీయ స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం ప్రత్యేక విమానాన్ని ఇంఫాల్ పంపిస్తోంది. ఈ విమానం రేపు ఉదయం ఇంఫాల్ చేరుకోనుంది. 

కాగా, మణిపూర్ లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తెలుగు వారి కోసం తెలంగాణ పోలీసులు 24×7 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. మణిపూర్ లోని తెలుగు పౌరులు సాయం పొందేందుకు 91 79016 43283 నెంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. ఈ హెల్ప్ లైన్ నెంబర్ డీఐజీ సుమతి ఆధ్వర్యంలో పనిచేయనుంది. 

ఇతరత్రా సందేహాలు, వివరాల కోసం [email protected] ను ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు. 

మణిపూర్ లో గిరిజనేతరులైన మెయితీలకు ఎస్టీ హోదా అంశం రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలకు కారణమైంది. మొయితీలకు ఎస్టీ హోదా అంశాన్ని గిరిజనులైన కుకీలు, నాగాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Manipur
Imphal
Plane
Helpline
Telangana

More Telugu News