ఆ మూడే మనల్ని వేరు చేస్తాయి.. ఇన్ స్టాలో సమంత పోస్ట్.. నాగచైతన్య వ్యాఖ్యలకు స్పందనేనా?

samantha reaction on naga chaitanya comments
షార్ట్స్‌లో చూడండి
నాగచైతన్య, సమంత విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా పేరుపొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను షాక్ కు గురి చేసింది. దీనికి కారణమేంటనే దానిపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇటు సమంత, అటు నాగచైతన్య ఎప్పుడూ దీనికి కారణం చెప్పలేదు. 

తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్లలో భాగంగా స్పందించిన నాగచైతన్య.. ‘‘సమంత మంచి వ్యక్తి. తను ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. సోషల్‌ మీడియాలో వచ్చిన వదంతుల వల్ల మా ఇద్దరి మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు జనాల్లోకి వెళ్లింది. అదే నన్ను బాధపెట్టింది’’ అని చెప్పారు.

‘‘నా గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం మరో చెత్త విషయం. దీని వల్ల మూడో వ్యక్తిని అగౌరవపరిచినట్లు అయింది’’ అని నాగ చైతన్య అసహనం వ్యక్తం చేశారు. తాము విడిపోయి రెండేళ్లు అవుతోందని, చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అవుతోందని వెల్లడించారు. ఇప్పటికీ తమ పెళ్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నారో, ఎందుకు వదంతులు సృష్టిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని వాపోయారు. 

ఈ నేపథ్యంలో సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. ‘‘మనమంతా ఒక్కటే. కేవలం అహంకారం, కొన్ని నమ్మకాలు, భయాలు మాత్రమే మనల్ని వేరు చేస్తాయి’’ అని అమెరికా ఇన్వెస్టర్ నికోలా టెస్లా చేసిన వ్యాఖ్యలను షేర్ చేశారు. చైతన్య వ్యాఖ్యలకు స్పందనగానే సమంత ఈ పోస్ట్ షేర్ చేసిందనే చర్చ సాగుతోంది. 

అలాగే మరో వీడియోను కూడా సమంత షేర్ చేసింది. సైకిల్ తొక్కుతూ ఓ పిల్లాడు పడిపోవడం, కానీ వెంటనే లేచి డ్యాన్స్ చేయడం అందులో కనిపించింది. ‘‘జీవితం నిన్ను సవాలు చేసినప్పుడు.. నీ ప్రతిస్పందన ఇలానే ఉండాలి’’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.

ఇదిలావుంచితే, నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. ఈ నెల 12న విడుదల కానుంది. వెంకట ప్రభు దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇక సమంత ఇటీవల ‘శాకుంతలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆమె నటించిన ‘ఖుషి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. బాలీవుడ్‌లో ‘సిటాడెల్‌’ సిరీస్‌లో నటిస్తోంది.
Go Back to Shorts
Samantha
Naga Chaitanya
samantha reaction on chaitanya comments

More Telugu News