Miss Universe: గుర్రపు స్వారీ చేస్తూ మిస్ యూనివర్స్ ఫైనలిస్టు మృతి

Miss Universe Finalist Sienna Weir Dies At 23 After Tragic Horse Riding Accident
  • ఆస్ట్రేలియా మోడల్ సియానా వేర్ దుర్మరణం
  • నెల రోజులకు పైగా లైఫ్ సపోర్ట్ పై ఉన్న మోడల్
  • కోలుకునే పరిస్థితి లేదని తేల్చిన వైద్యులు
  • లైఫ్ సపోర్ట్ తొలగించిన సియానా ఫ్యామిలీ
గతేడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో ఫైనల్ దాకా వెళ్లిన ఓ మోడల్ అర్ధాంతరంగా చనిపోయింది. గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు నెల రోజులకు పైనే లైఫ్ సపోర్ట్ పై ఆసుపత్రి బెడ్ మీద గడిపిన ఆ యువతి 23 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్యాషన్ మోడల్, మిస్ యూనివర్స్ ఫైనలిస్ట్ సియానా వేర్ గురువారం చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు.

మూడేళ్ల వయసు నుంచే గుర్రపు స్వారీ చేస్తున్న సియాన.. గత నెలలో ఆస్ట్రేలియాలోని విండ్సర్ పోలో గ్రౌండ్స్ లో గుర్రంపై పరుగులు తీస్తుండగా ప్రమాదం జరిగింది. వేగంగా పరిగెత్తుతున్న గుర్రం అకస్మాత్తుగా కిందపడిపోయింది. దీంతో సియానాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. సియానా ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండడంతో లైఫ్ సపోర్ట్ పై ఉంచినట్లు డాక్టర్లు చెప్పారు. నెల రోజుల తర్వాత కూడా ఆమె కోలుకోకపోవడంతో వైద్యుల సలహాతో లైఫ్ సపోర్ట్ నిలిపివేసినట్లు సియానా కుటుంబ సభ్యులు తెలిపారు. సియానా మృతిని ఆమె మోడలింగ్ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. సియానా తమ గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

2022 లో ఆస్ట్రేలియాలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో ఫైనల్ దాకా చేరిన 27 మందిలో సియానా కూడా ఉన్నారు. సిడ్నీ యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్ లిటరేచర్ తో పాటు సైకాలజీలో సియానా డిగ్రీ పట్టా అందుకున్నారు. మోడలింగ్ కెరీర్ గా ఎంచుకున్న సియానాకు గుర్రపు స్వారీ అంటే చాలా ఇష్టమని చెబుతుండేవారు. వారంలో రెండు మూడు రోజులు గ్రామీణ ప్రాంతానికి వెళ్లి గుర్రపు స్వారీ చేస్తుంటానని సియానా గతంలో చెప్పారు.
Miss Universe
Sienna Weir
Horse Riding
Accident
Australia

More Telugu News