Thota Chandrasekhar: ఏపీలో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయబోతోంది: తోట చంద్రశేఖర్

BRS will contest in all seats in AP says Thota Chandrasekhar
  • 175 శాసనసభ, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామన్న తోట
  • బీఆర్ఎస్ కు ఏపీ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని వ్యాఖ్య
  • దేశంలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందన్న తోట
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్థానాలకు పోటీ చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. తెలంగాణ మోడల్ దేశమంతా విస్తరించాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ దేశంలో తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని అన్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని రికార్డు సమయంలో నిర్మించారని అన్నారు. దేశ చరిత్రను తిరగరాసే అనేక సందర్భాలకు బీఆర్ఎస్ కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు. 

దేశ ప్రజల మధ్య బీజేపీ మత విద్వేషాలను సృష్టిస్తోందని తోట చంద్రశేఖర్ విమర్శించారు. బీజేపీని ఎదుర్కోవడంలో జాతీయ పార్టీ కాంగ్రెస్ పూర్తిగా విఫలమయిందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడగలిగే సత్తా, ధైర్యం కేవలం కేసీఆర్ కు మాత్రమే వున్నాయని చెప్పారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందన్నారు.
Thota Chandrasekhar
BRS
KCR
BJP
Congress

More Telugu News