SRH: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోల్ కతా... 2 ఓవర్లకే 2 వికెట్లు తీసిన సన్ రైజర్స్

  • ఐపీఎల్ లో సన్ రైజర్స్ ఇక ప్రతి మ్యాచ్ గెలవాల్సిందే!
  • ఇవాళ సొంతగడ్డపై కేకేఆర్ తో ఆడుతున్న సన్ రైజర్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • విజృంభించిన సన్ రైజర్స్ పేసర్ మార్కో జాన్సెన్
SRH scalps 2 wickets as after KKR won the toss and elected bat first

ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు సంక్షిష్టంగా ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఇప్పటి నుంచి తాను ఆడే ప్రతి మ్యాచ్ లోనూ గెలిచినా కానీ... సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడుతోంది.

సొంతగడ్డ ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆడుతుండడం సన్ రైజర్స్ కు సానుకూల అంశమే అయినా, టాస్ ఓడిపోవడం ప్రతికూలంగా మారింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ లో ఇంకా మెరుగవ్వాల్సి ఉన్న తరుణంలో, కోల్ కతా జట్టు భారీ టార్గెట్ నిర్దేశిస్తే పరిస్థితి ఏంటన్నది అనిశ్చితి కలిగిస్తోంది. 

ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో పేసర్ కార్తిక్ త్యాగికి చోటు కల్పించారు. లెఫ్టార్మ్ సీమర్ మార్కో జాన్సెన్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. కోల్ కతా జట్టులోనూ రెండు మార్పులు జరిగాయి. డేవిడ్ వీస్ స్థానంలో జాసన్ రాయ్, జగదీశన్ స్థానంలో వైభవ్ అరోరాను తీసుకున్నట్టు ఆ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా వెల్లడించాడు. 

ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కోల్ కతా జట్టు రెండో ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సన్ రైజర్స్ బౌలర్ మార్కో జాన్సన్ విసిరిన ఆ ఓవర్ తొలిబంతికి ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అవుటయ్యాడు. ఆ ఓవర్ చివరి బంతికి ప్రమాదకర వెంకటేశ్ అయ్యర్ (7) అవుటయ్యాడు. ప్రస్తుతం కేకేఆర్ స్కోరు 2 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. జాసన్ రాయ్ (9), కెప్టెన్ నితీశ్ రాణా (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News