'విరూపాక్ష' వసూళ్ల అంకెలు మారుతూనే ఉన్నాయ్!

Virupaksha Movie Update
  • సాయితేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష'
  • బలమైన కథాకథనాలతో మెప్పించిన సినిమా 
  • 13 రోజుల్లో 82.3 కోట్ల వసూళ్లు 
  • ఈ వీకెండ్ కి 85 కోట్ల మార్క్ ను టచ్ చేసే ఛాన్స్
ఈ మధ్య కాలంలో బలమైన కంటెంట్ ఉంటే మాత్రమే ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు. లేదంటే స్టార్స్ ఉన్నప్పటికీ, థియేటర్ల దగ్గర జనాలు పల్చగానే కనిపిస్తున్నారు. మొదటి మూడు థియేటర్స్ లో సినిమా నిలబడితే చాలు అనుకునే పరిస్థితి. చాలా సినిమాలు వీకెండ్ తరువాత థియేటర్స్ లో కనిపించడం లేదు. 

ఇలాంటి పరిస్థితుల్లో 'విరూపాక్ష' థియేటర్లకు వచ్చింది. సాయితేజ్ - సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 21వ తేదీన విడుదలైంది. కార్తీక్ దండుకి దర్శకుడిగా ఇది రెండో సినిమా. ఇక వరుస ఫ్లాపుల తరువాత సాయితేజ్ చేసిన సినిమా. అందువలన పెద్దగా అంచనాలు లేకుండానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

తొలిరోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, 13 రోజుల్లో 82.3 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ వీకెండ్ కి 85 కోట్ల మార్క్ ను టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 100 కోట్ల క్లబ్ లో ఈ సినిమా చేరడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన కథాకథనాలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ... ఫొటోగ్రఫీ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించాయి.
Go Back to Shorts
Saitej
Samyuktha Menon
Virupaksha

More Telugu News