తల్లి కాబోతున్న ఇలియానా.. తండ్రి ఎవరో మరి?
- బేబీ బంప్ వీడియోను షేర్ చేసిన హీరోయిన
- దేవదాసు చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ
- చాన్నాళ్లు తెలుగులో అగ్ర హీరోయిన్ గా ఉన్న ఇలియానా
అయితే, తొలిసారి బేబీ బంప్ తో ఉన్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిందామె. కాగా, ఇలియానాకు ఇంకా పెళ్లి కాలేదు. తనకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరన్నది ఇలియానా వెల్లడించలేదు. గతంలో ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసిన ఇలియానా 2019లో అతని నుంచి విడిపోయింది. నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కత్రినా, విక్కీ తదితరులతో కలిసి మాల్దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అయితే, ఇలియానా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇంకా బహిర్గతం చేయలేదు.