ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ అధినేత ఖర్గే తనయుడికి ఈసీ నోటీసులు
- చర్యలు ఎందుకు తీసుకోకూడదో రేపటిలోగా చెప్పాలని నోటీసులు
- చేతకాని వ్యక్తి అంటూ ప్రధాని మోదీపై విమర్శలు
- చిత్తాపూర్ నుండి బరిలోకి దిగిన ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో నోటీసుకు మే 4 సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ పేర్కొంది. ప్రధాని మోదీపై అనుచిత పదజాలం ఉపయోగించారంటూ ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. ప్రియాంక్ చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.