క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి.. పుతిన్ హత్యకు కుట్ర.. తమకు సంబంధం లేదన్న ఉక్రెయిన్.. దాడి వీడియో ఇదిగో!
- క్రెమ్లిన్ భవనాన్ని లక్ష్యంగా చేసుకున్న డ్రోన్లను కూల్చేసిన రష్యా
- ఇది పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఉగ్రదాడేనన్న క్రెమ్లిన్
- అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణ
- ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదని స్పష్టీకరణ
- ఇలాంటి దాడికి తాము పాల్పడబోమన్న ఉక్రెయిన్
- అది మిలటరీ లక్ష్యాలను పరిష్కరించబోదని స్పష్టీకరణ
డ్రోన్ల దాడి నుంచి పుతిన్ సురక్షితంగా తప్పించుకున్నారని, ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని క్రెమ్లిన్ ప్రకటించింది. అలాగే, క్రెమ్లిన్ భవనానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఇది ప్రణాళిక ప్రకారం జరిగిన ఉగ్ర దాడి అని, అధ్యక్షుడి ప్రాణాలను హరించేందుకే పన్నిన కుట్ర అని ఆరోపించింది. డ్రోన్ దాడి జరిగినప్పుడు పుతిన్ ఆ భవనంలో లేరని పేర్కొంది.
రష్యా ఆరోపణపై ఉక్రెయిన్ స్పందించింది. ఆ డ్రోన్లకు, తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అధికార ప్రతినిధి మిఖాయ్లో పోడోల్యాక్ తెలిపారు. క్రెమ్లిన్‌పై ఉక్రెయిన్ దాడిచేయబోదని, ఎందుకంటే మిలటరీ లక్ష్యాలను అది పరిష్కరించలేదని పేర్కొన్నారు.