కేదార్ నాథ్ లో భారీగా హిమపాతం.. వీడియో ఇదిగో!
- అక్కడే చిక్కుకున్న 150 మంది తెలుగు యాత్రికులు
- భక్తులను తరలించే ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- ఎడతెగని హిమపాతంతో ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎడతెగని హిమపాతం కారణంగా కేదార్ నాథ్ లో అధికారులు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రిషికేష్‌లో యాత్రికుల రిజిస్ట్రేషన్ ను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులను బట్టి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో రెండు మూడు రోజులపాటు హిమపాతం కొనసాగే అవకాశం ఉందని రుద్రప్రయాగ్ కలెక్టర్ తెలిపారు.