జగన్ భోగాపురం పర్యటన.. పలాసలో ట్రాఫిక్ నిలిపివేత
- జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
- అక్కడికి జగన్ వస్తే ఇక్కడ లారీలు ఆపేయడమేంటని డ్రైవర్ల ఆగ్రహం
- ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలంటూ పోలీసుల వివరణ
విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి జగన్ బుధవారం భోగాపురం చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా పలాసలో వాహనాలను నిలిపివేశారు. దీనిపై లారీ డ్రైవర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే వాహనాలను ఆపేసినట్లు ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు.