Gujarat Titans: అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ తో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ

Delhi Capitals face off with mighty Gujarat Titans
  • ఐపీఎల్ లో నేడు గుజరాత్ టైటాన్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ
ఐపీఎల్ లో అన్ని జట్ల కంటే నాసిరకంగా ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మరో అగ్నిపరీక్షకు సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగునున్న ఢిల్లీ జట్టు ఇవాళ అత్యంత బలమైన గుజరాత్ టైటాన్స్ తో ఆడుతోంది. గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ టైటాన్స్ సొంతగడ్డ అహ్మదాబాద్ లో జరుగుతుండడం ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రతికూలాంశమే. అక్కడ అభిమానుల మద్దతు టైటాన్స్ కే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇవాళ్టి మ్యాచ్ కోసం తమ జట్టులో ఎలాంటి మార్పులు లేవని గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. 

ఢిల్లీ జట్టులో మాత్రం రెండు మార్పులు జరిగాయి. ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ అస్వస్థతకు గురికావడంతో అతడి స్థానంలో రిలీ రూసో ఆడుతున్నాడు. లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ గాయం నుంచి కోలుకోవడంతో అతడు కూడా బరిలో దిగుతున్నాడు.
Gujarat Titans
Delhi Capitals
IPL

More Telugu News