Karthik Raju: రిలీజ్ కి రెడీ అవుతున్న మరో క్రైమ్ థ్రిల్లర్ .. 'అథర్వ'

Atharva movie update
షార్ట్స్‌లో చూడండి
క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందే సినిమాలను చూడటానికి ఒక వర్గం ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి 'అథర్వ' సిద్ధమవుతోంది. కార్తీక్ రాజు - సిమ్రాన్ చౌదరి జంటగా నటించిన ఈ సినిమా, విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సుభాష్ నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా ఉత్కంఠభరితంగా కొనసాగనుంది. ఎప్పుడు ఏం జరుగుతుందా? అనే ఆసక్తితో ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉండేలా ఈ కథ నడుస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. 

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకి చేరుకున్నాయి. ఐరా .. అరవిందకృష్ణ .. కబీర్ సింగ్ దుల్హన్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు, తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో, జూన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


Go Back to Shorts
Karthik Raju
Simran Choudary
Aira
Atharva Movie

More Telugu News