Karnataka: కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. గ్యారంటీ కార్డ్ పేరుతో మహిళలు, నిరుద్యోగులపై వరాలు!

  • ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
  • ఓటర్లను ఆకట్టుకునేలా కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో
  • ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
Karnataka Congress manifesto

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితర నేతలు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను రూపొందించారు. ముఖ్యంగా గ్యారంటీ కార్డ్ పేరుతో మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో హామీలను గుప్పించారు. గ్యారంటీ కార్డ్ హామీల్లో గృహజ్యోతి, గృహలక్ష్మి, అన్న భాగ్య, యువనిధి, యువశక్తి ఉన్నాయి. 

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రధాన హామీలు:

  • ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (గృహజ్యోతి)
  • కుటుంబ పెద్దగా ఉండే మహిళలకు నెలకు రూ. 2 వేలు (గృహలక్ష్మి)
  • నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ. 3 వేల భృతి (యువనిధి)
  • డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ. 1,500 (యువశక్తి)
  • కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
  • ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఏడాది లోగా భర్తీ
  • ప్రతి వ్యక్తికి 10 కేజీల ఆహార ధాన్యాలు (అన్న భాగ్య).

More Telugu News