యువ కొరియోగ్రాఫర్ ఆత్మహత్యపై నటి శ్రద్ధా దాస్ స్పందన
- ఢీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చైతన్య
- నెల్లూరులోని క్లబ్ హోటల్ లో ఆత్మహత్య
- అప్పుల భారం పెరిగిపోయిందంటూ సెల్ఫీ వీడియో
- చైతన్య ఎంతో మంచివాడన్న శ్రద్ధా దాస్
చైతన్య మాస్టర్ ఎంతో మంచివాడని, అతడిది గొప్ప మనసు అని తెలిపారు. మీరు నవ్వుతూ, అందరినీ నవ్వించేవాళ్లు మాస్టర్... కానీ ఇవాళ మీరు నన్ను చాలా ఏడిపించారు. మీ నవ్వును మర్చిపోలేను అంటూ శ్రద్ధా సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
పుట్టడం, చనిపోవడం ఎప్పుడు, ఎందుకు జరుగుతాయో తెలియవని, కానీ ఆ రెండింటి మధ్యలో మనం ఎలా బతికామన్నదే మన గొప్పతనాన్ని నిర్ణయిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. చైతన్య మాస్టర్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని తెలిపారు.