నేటి రాత్రి నుంచి కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు

  • తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
  • ఏపీలో మరో మూడ్రోజుల పాటు వానలు
  • నేడు రాయలసీమలో వర్షాలు
  • ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు
  • పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు
ఏపీలో మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఇవాళ రాయలసీమలో వర్షాలు పడతాయని, నేటి రాత్రి, రేపు వేకువజామున కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించారు. అత్యధిక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 

కాగా, విజయవాడలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయం అయ్యాయి. అటు తెలంగాణలో కూడా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి.

Rain Alert
Coastal Andhra Pradesh
Rayalaseema
Andhra Pradesh
Telangana

More Telugu News