సాంత్వన చేకూర్చనప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు?: జగన్ కు లోకేష్ ప్రశ్న
- ఏ రైతును కదిలించినా కన్నీళ్లు, కష్టాలే కనిపిస్తున్నాయన్న లోకేశ్
- పంట దెబ్బతిన్నప్పటికీ రైతును పట్టించుకోవడం లేదని విమర్శ
- కడిమెట్ల శివారులో మొక్కజొన్నను పరిశీలించిన లోకేశ్
రెండు ఎకరాల్లో మొక్కజొన్న వేసేందుకు పెట్టుబడి యాభై వేల రూపాయలు అవుతోందని, కౌలు నలభై వేల రూపాయలు అవుతోందని, మొత్తం తొంబై వేల రూపాయలు ఖర్చు అయితే దిగుబడి మాత్రం రూ.9వేలు మాత్రమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలకు పంట నష్ట పోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆయన కడిమెట్ల శివారులో దెబ్బతిన్న మొక్క జొన్న పంటను పరిశీలించారు.