Jagan: సాత్విక్ సాయిరాజ్ కు సీఎం జగన్ అభినందనలు

CM Jagan congratulates Satwik Sairaj and Chirag who won Asia Badminton Championship gold
  • ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో భారత్ కు స్వర్ణం
  • 58 ఏళ్ల తర్వాత భారత్ కు పసిడి అందించిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి
  • డబుల్స్ ఫైనల్లో భారత్ ద్వయం జయభేరి
  • సాత్విక్ పట్ల గర్విస్తున్నానని సీఎం జగన్ వెల్లడి
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇవాళ చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించిన తెలుగుతేజం సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆసియా బ్యాడ్మింటన్ షిప్ లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణం కైవసం చేసుకోవడం. ఈ జోడీ ఆసియా బ్యాడింటన్ చాంపియన్ షిప్ లో భారత్ 58 ఏళ్ల తర్వాత ఓ పసిడి పతకాన్ని అందించింది. 

దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్-2023లో విజేతలుగా నిలిచినందుకు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ లకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అద్భుత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సాత్విక్ అమోఘమైన ఆట ప్రదర్శించడం పట్ల గర్విస్తున్నానని తెలిపారు. తెలుగు జాతి కీర్తిపతాకం సమున్నతంగా ఎగురుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.
Jagan
Satwik Sairaj Rankireddy
Chirag Shetty
Asia Badminton Championship
Gold
India
Andhra Pradesh
Telugu

More Telugu News