commercial: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు

  • రూ.171.50 తగ్గిన 19 కిలోల సిలిండర్ ధర
  • వరుసగా రెండో నెలలోనూ తగ్గింపు
  • రెండు నెలల్లో రూ.263 మేర దిగొచ్చిన భారం
  • గృహ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో మార్పు లేదు
commercial LPG cylinder prices slashed by Rs 171 Check details here

వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లపై గణనీయమైన ఉపశమనం లభించింది. 19 కిలోల సిలిండర్ ధరను రూ.171.50 మేర తగ్గిస్తున్నటు ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. సవరణ తర్వాత 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,856.50గా ఉంది. మే 1 నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చేశాయి. ఇదే సిలిండర్ ముంబైలో రూ.1,808.50గా ఉంది. కోల్ కతాలో రూ.1,960.50కు దిగి వచ్చింది. తగ్గింపు తర్వాత చెన్నైలో విక్రయ ధర రూ.2,132గా ఉంది. 

నిజానికి ఇదే ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధరను ఏప్రిల్ 1న కూడా రూ.91.50 తగ్గించడం గమనార్హం. ఈ ఏడాది మార్చి 1న 19 కిలోల వాణిజ్య సిలండర్ ధరను చమురు కంపెనీలు రూ.350.50 మేర పెంచాయి. ఇందులో రూ.263 మేర తగ్గించినట్టయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం ఉపశమనాన్ని ఇచ్చింది. గృహావసరాలకు మినహా మిగిలిన చోట్ల ఎక్కడా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లనే వినియోగించాల్సి ఉంటుంది. ఇక గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

More Telugu News