10 రోజుల్లో 'విరూపాక్ష' ఎంత వసూలు చేసిందంటే!
- సాయితేజ్ హీరోగా వచ్చిన 'విరూపాక్ష'
- 4 రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు
- 10 రోజుల్లో 76 కోట్ల గ్రాస్ వసూళ్లు
- త్వరలో 100 కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్
సుకుమార్ స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. తొలి రోజున 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 4 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. నిన్నటితో ఈ సినిమా 10 రోజులను పూర్తి చేసుకుంది. ఈ 10 రోజుల్లో ఈ సినిమా 76 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.
ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. 'ఏజెంట్' ..'పొన్నియిన్ సెల్వన్ 2' సినిమాలు కూడా 'విరూపాక్ష' వసూళ్లను ప్రభావితం చేయలేకపోయాయి. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.