Chandrababu: కుప్పం ప్రశాంతంగా ఉంటే జగన్ రెడ్డికి కడుపు మంట: చంద్రబాబు

Chandrababu slams CM Jagan
  • ఎప్పుడూ లేని విధంగా రౌడీ మూకలు ఇళ్లపై పడ్డాయన్న చంద్రబాబు 
  • వాహనాలను తగులబెడుతున్నారని ఆరోపణ 
  • కుప్పంను ఉద్ధరిస్తానని నువ్వు చేస్తోంది ఇదా అంటూ జగన్ పై మండిపాటు
  • పులివెందులకు తాను నీళ్లు ఇచ్చానని చంద్రబాబు స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. కుప్పం ప్రశాంతంగా ఉంటే జగన్ రెడ్డికి కడుపు మంట అని మండిపడ్డారు. ఎప్పుడూ లేని విధంగా రౌడీ మూకలు ఇళ్ల మీద పడుతున్నాయని, వాహనాలను తగులబెడుతున్నాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"పులివెందులకు నేను నీళ్లు తెచ్చాను. మరి కుప్పంను ఉద్ధరిస్తానంటున్న నువ్వు ఏం చేశావు? దాడులు, హింసా సంస్కృతిని పెంచి కుప్పం ప్రశాంతతకు నిప్పు పెట్టావు. నీ దృష్టిలో ఉద్ధరించడం అంటే ఇదేనా?" అంటూ చంద్రబాబు సీఎం జగన్ ను నిలదీశారు. 

వైసీపీ ఫ్రస్ట్రేషన్ కు పోలీసులు, అధికారులు ఎందుకు మద్దతుగా నిలుస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల మనసులు గెలవాలి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి తప్ప, ఇలా దాడులు, దహనాలు కాదని హితవు పలికారు.
Chandrababu
Jagan
Kuppam
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News