Summer Holidays: ఏపీలో బడులకు సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే..!

  • మే 1 నుంచి ఏపీలో సమ్మర్ హాలీడేస్
  • వచ్చే శనివారమే చివరి పని దినం
  • జూన్ 12న తెరుచుకోనున్న స్కూళ్లు
  • తెలంగాణలో రెండు రోజుల కిందటే మొదలైన సెలవులు
ap government announces summer holidays to all schools

ఏడాదిపాటు తరగతులు, హోంవర్క్‌లు, ట్యూషన్లు, పరీక్షలతో సతమతమైన పాఠశాల విద్యార్థులకు తీపి కబురు. ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించారు. అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మే 1 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యా కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఏప్రిల్‌ 30న ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే సెలవులు మొదలవుతాయి. అంటే శనివారమే చివరి పని దినం. జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. మొత్తంగా చూసుకుంటే 43 రోజులు వేసవి సెలవులు ఇచ్చారు.

మరోవైపు తెలంగాణలో ఇప్పటికే వేసవి సెలవులు మొదలయ్యాయి. ఈ నెల 25 నుంచి హాలిడేస్ ప్రకటించారు. తెలంగాణలో కూడా జూన్‌ 12న బడులు పునఃప్రారంభం అవుతాయి. జూన్‌ మొదటి వారం నుంచే బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. జూన్‌ 1 నుంచి బడులు తెరుచుకోనుండగా, విద్యా సంవత్సరం మాత్రం 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

More Telugu News