నేడు కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. ఈదురు గాలులు!
- మరాఠ్వాడా మీదుగా కర్ణాటక వరకు ద్రోణి
- నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు
- అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
నిన్న మధ్యాహ్నం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉక్కపోతతోపాటు ఎండ తీవ్రత కొనసాగింది. దీంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అనంతపురంలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.