పోలీసులపై చేయిచేసుకున్న షర్మిల అరెస్ట్.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- నిరుద్యోగ సమస్యలపై ధర్నా చేసేందుకు బయల్దేరిన షర్మిల
- షర్మిలను అడ్డుకున్న పోలీసులు
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు
ఈ క్రమంలో ఆమెను మహిళా పోలీసులు గట్టిగా పట్టుకుని ముందుకు కదలనివ్వలేదు. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిలపై సెక్షన్ 330, 353 కింద కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై చేయి చేసుకున్నట్టు కేసు బుక్ చేశారు.