Chandrababu: యర్రగొండపాలెంలో చంద్రబాబు సభపై కేసు నమోదు

Police files case on Chandrababu rally in Yerragondapalem
  • నిన్న యర్రగొండపాలెంలో పర్యటించిన చంద్రబాబు
  • షెడ్యూల్ ప్రకారం రాళ్లవాగు వద్ద సభ
  • కానీ ఎన్టీఆర్ సర్కిల్ వద్దే ప్రసంగించిన చంద్రబాబు
  • చీకటి పడుతుండడం, ప్రతికూల వాతావరణమే కారణం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ జరపడంపై కేసు నమోదైంది. అనుమతి లేని ప్రదేశంలో బహిరంగ సభ నిర్వహించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు రాళ్లవాగు వద్ద సభ నిర్వహించాల్సి ఉంది. అయితే, చీకటి పడుతుండడంతో పాటు, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ఎన్టీఆర్ సర్కిల్ వద్దే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కారణంగానే పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. 

కాగా, చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనలో జరిగిన ఘటనలపై టీడీపీ నేతలు జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. చంద్రబాబు భద్రతాధికారి రాళ్ల దాడిలో గాయపడిన విషయాన్ని పోలీసు ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లారు.
Chandrababu
Yerragondapalem
Case
Police
TDP
Prakasam District
Andhra Pradesh

More Telugu News