ఉగ్రదాడి ఘటనతో కేంద్ర పారా మిటలరీ దళాలకు హోం శాఖ కీలక ఆదేశాలు
- కదలికల్లో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన
- జమ్మూ కశ్మీర్ లో హై అలర్ట్ ప్రకటన
- దాడి జరిగిన సమీప ప్రాంతాలను జల్లెడ పడుతున్న బలగాలు
ఈ దాడి అనంతరం భారత భద్రతా దళాలు మెంధార్ సబ్-డివిజన్‌లోని వివిధ గ్రామాల్లో గాలింపు చర్యలు చేపట్టింది. భింబర్ గలి, భాటా ధురియన్ మధ్య జాతీయ రహదారిపై అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేశారు. భటా ధురియన్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో భింబర్ గలి నుండి సురన్‌కోట్ రోడ్డు వరకు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నట్లు పూంచ్ జిల్లాలోని జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు. భారీగా బలగాలను మోహరించి భాటా ధురియన్, నార్ ఫారెస్ట్, సంజియోట్, కోటన్‌తో సహా పలు గ్రామాలను చుట్టుముట్టాయి. సాయుధ పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు.