Gopichand: నేను హైవేలో డేంజర్ జోన్ బోర్డులాంటివాడిని .. 'రామబాణం' ట్రైలర్ రిలీజ్!

  • గోపీచంద్ హీరోగా రూపొందిన 'రామబాణం'
  • యాక్షన్ తో కూడిన ఎమోషన్స్ తో సాగే కథ 
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • మే 5వ తేదీన సినిమా విడుదల  
Ramabnam Trailer Released

గోపీచంద్ హీరోగా శ్రీవాస్ 'రామబాణం' సినిమాను రూపొందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన ఈ సినిమాలో, గోపీచంద్ జోడీగా డింపుల్ హయతి అలరించనుంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మే 5వ తేదీన విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంటును రాజమండ్రిలో నిర్వహించారు. ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ చేసే జగపతిబాబు .. ఆయనను దెబ్బతీయడానికి విలన్ చేసే ప్రయత్నంగా ఈ కథ నడుస్తుందని అనిపిస్తోంది. జగపతిబాబును సపోర్టు చేసే తమ్ముడిగా గోపీచంద్ కనిపిస్తున్నాడు. విలన్ బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం హీరో రంగంలోకి దిగడం ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది. 

"నేను హైవేలో డేంజర్ బోర్డులాంటివాడిని .. వార్నింగ్ ఇచ్చిన తరువాత కూడా స్పీడ్ తగ్గించకపోతే .. చావు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది" అంటూ గోపీచంద్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ఈ సినిమాకి హైలైట్. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.

More Telugu News