'విరూపాక్ష' విషయంలో నేనిచ్చే హామీ ఇదే: సాయితేజ్

Virupaksha Movie Press Meet
  • సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష'
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • టికెట్ రేటుకి తగిన వినోదాన్ని అందిస్తుందన్న సాయితేజ్ 
  • రేపు థియేటర్లకు వస్తున్న సినిమా
సాయితేజ్ హీరోగా హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో 'విరూపాక్ష' సినిమా రూపొందింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ - సుకుమార్ నిర్మించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. దర్శకనిర్మాతలు .. సాయితేజ్ .. సంయుక్త .. సోనియా సింగ్ ఇందులో పాల్గొన్నారు. 

ఈ వేదికపై సాయితేజ్ మాట్లాడుతూ .. "ప్రమాదం తరువాత నేను చేసిన సినిమా ఇది. మళ్లీ కెమెరా ముందుకు వచ్చినప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నట్టుగా అనిపించింది. ఈ సినిమా కోసం మేమందరం కూడా ఇష్టంతో కష్టపడ్డాం. థియేటర్ కి వచ్చిన వాళ్లంతా కూడా అదే మాట చెబుతారు. టికెట్ రేటుకి తగిన ఎంటర్టయిన్ మెంట్ ను ఈ సినిమా అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను" అన్నాడు. 

"ఇంతవరకూ ఈ తరహా జోనర్లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. అలాంటి జోనర్లోనే ఈ సినిమా వస్తుందని నేను చెప్పగలను. ఈ సినిమాను థియేటర్స్ లో మీ స్నేహితులతో .. మీ కుటుంబ సభ్యులతో కలిసి చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు .. అందులో ఎలాంటి సందేహం లేదు" అని చెప్పుకొచ్చాడు. 

Go Back to Shorts
Sai Tej
Samyuktha Menon
Sonia Singh
Vieupaksha

More Telugu News