Sunitha: అవినాశ్ రెడ్డిని 25 వరకు అరెస్ట్ చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సునీత పిటిషన్

  • వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ
  • ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్
  • తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన సునీత
YS Sunitha files petition in Supreme Court against YS Avinash Reddy bail

వైఎస్ వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను ప్రతి రోజూ విచారిస్తోంది. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ అవినాశ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు... ఈ నెల 25 వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. 25న తమ తీర్పును వెలువరిస్తామని చెప్పింది. 

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేశారు. 25న హైకోర్టు తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో... వెంటనే ఈ పిటిషన్ పై విచారణ జరపాలని సునీత తరపు లాయర్ సుప్రీంకోర్టును కోరారు. దీనికి సమాధానంగా రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం తెలిపింది.

More Telugu News