Akhil: 'ఏజెంట్' ట్రైలర్ రిలీజ్ .. 6 దేశాలలో అఖిల్ ఫైట్లు!

  • ఈ నెల 28న 'ఏజెంట్' సినిమా రిలీజ్ 
  • ఈ టైటిల్ తో అఖిల్ గుర్తుండిపోతాడన్న నిర్మాత 
  • సురేందర్ రెడ్డి మార్క్ సినిమా అని వెల్లడి 
  • అంచనాలు పెంచుతున్న ట్రైలర్  

Agent movie trailer launch event

సురేందర్ రెడ్డి అనే పేరు భారీ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన దర్శకత్వంలో అఖిల్ 'ఏజెంట్' సినిమా చేశాడు. ఈ సినిమాతో కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించాడు. 'కాకినాడ'లో జరిగిన ఈ సినిమా ఈవెంటులో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

విలన్ గ్యాంగ్ వేసే ఎత్తులు .. అందుకు తగిన విధంగా హీరో టీమ్ అమలు పరిచే వ్యూహాలకి సంబంధించిన సన్నివేశాలపై .. భారీ యాక్షన్ దృశ్యాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నిర్మాణ విలువలు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఈ ట్రైలర్ ను చూస్తేనే అర్థమైపోతోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

ఈ వేదికపై అనిల్ సుంకర మాట్లాడుతూ .. "ఈ సినిమా తరువాత ఎవరు ఎక్కడ 'ఏజెంట్' అనే మాట విన్నా, వెంటనే అఖిల్ గుర్తుకు వచ్చేలా ఈ సినిమా ఉంటుంది. సురేందర్ రెడ్డి స్టైలీష్ టేకింగ్ కి ఎంతమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలోని ఫైట్లను 6 దేశాలలో చిత్రీకరించాము. తప్పకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News