Ganta Srinivasa Rao: మనవడితో క్రికెట్ ఆడిన గంటా శ్రీనివాసరావు... వీడియో ఇదిగో!

Ganta Srinivasa Rao plays cricket with grandson
  • దేశంలో ఐపీఎల్ మేనియా
  • గంటా నివాసంలోనూ క్రికెట్ సందడి
  • త్రో డౌన్లు విసిరిన మనవడు
  • బ్యాటింగ్ చేసిన గంటా
  • సోషల్ మీడియాలో వీడియో పంచుకున్న వైనం
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న తరుణంలో ఎక్కడ చూసినా క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలోనూ క్రికెట్ సందడి దర్శనమిచ్చింది. గంటా తన మనవడితో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. మనవడు త్రో డౌన్లు విసురుతుండగా, గంటా బ్యాటింగ్ చేస్తూ ఆస్వాదించారు. 

దీనికి సంబంధించిన వీడియోను గంటా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అభిమానులను ఈ వీడియో విశేషంగా ఆకట్టుకుంటోంది.
Ganta Srinivasa Rao
Cricket
Grandson
IPL
TDP

More Telugu News